© 2026 nimisham.in

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. extend EV commercial vehicle age limit: దేశంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయానికి రెడీ అయ్యింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సీఎన్జీతో నడిచే కమర్షియల్ వెహికల్స్ లైఫ్ లిమిట్ ను మరో 5 ఏళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కీలక ముసాదాయిను రిలీజ్ చేసింది. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీతో నడిచే వెహికల్స్ యజమానులకు పెద్దపీట వేయాలన్నలక్ష్యంతోనే సర్కార్ ఈ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నేషనల్ పర్మిట్ వ్యవస్థలో కొన్ని రకాల కమర్షియ్ వెహికల్స్ కు ఉన్న 12,15ఏళ్ల గడువును .. ఈ కొత్త సవరణ ద్వారా 17,20 ఏళ్లకు పెంచనున్నారు. అయితే ఈ మినహాయింపు అన్నిరకాల వాణిజ్య వెహికల్స్ వర్తించదని కేవలం బ్యాటరీతో నడిచేవి, హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే వెహికల్స్ కు మాత్రమే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేసింది. కమర్షియల్ రంగంలో క్లీన్ ఎనర్జీ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా వెహికల్స్ నేషనల్ పర్మిట్ ప్రక్రియను మరింత ఈజీగా చేయడంతోపాటు ఆన్ లైన్ డాక్యుమెంటేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దరఖాస్తుదారులు కోరుకుంటే నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ ను ఒకేసారీ 5ఏండ్ల వరకు ఎలక్ట్రానిక్ విధానంలో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికోసం ఏడాదికి 16వేల 500 చొప్పున ఐదేళ్లకు 82వేల ఫీజు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే వాహన్ పోర్టల్ వినియోగాన్ని మరింత విస్త్రుతం చేసి డీలర్లు
వాహన యజమానులకు సంబంధించిన వివరాలను ఆటోమేటిగ్గా సేకరించే ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.
ఇక టెంపరరీ రిజిస్ట్రేషన్ నిబంధనల విషయంలోనూ మార్పులు తీసుకువచ్చారు. బాడీ లేని చాస్సిస్ రిజిస్ట్రేషన్ గడువును 6 నెలలపాటు పొడిగించారు. వర్క్ షాపుల్లో జరిగే ఆలస్యాలు, ఇతర ఊహించని పరిణామాల వల్ల గడువు మీరినట్లయితే మరో 30 రోజులపాటు పొడిగించే అధికారాన్ని రిజిస్టరింగ్ అధికారులకు కల్పించారు. వెహికల్ రిజిస్ట్రేషన్ ఇతర డాక్యుమెంటేషన్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా మార్చేందుకు తాజా మార్పులు దోహదం చేయనున్నాయి.
ఈ ముసాయిదా నిబంధనలపై ఆగస్టు 10వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యంతరాలు సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం నెల రోజుల సమయం ఇచ్చింది. అధికారిక గెజిట్ వెలువడిన తర్వాతే ఈ చట్ట సవరణలు అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు, గ్రీన్ వెహికల్స్ వాడకాన్ని పెంచడంతోపాటుగా కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మరింత ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.