© 2026 nimisham.in

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” వేడుకలకు సర్వం సిద్ధమైంది. నార్త్ కరోలినాలోని ‘షార్లెట్ కన్వెన్షన్ సెంటర్’ (Charlotte Convention Center) వేదికగా 2026 జులై 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రధాన ఆకర్షణ.. ఈ వేడుకల్లో భాగంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి గారి ‘లైవ్ కాన్సర్ట్’ (MM Keeravani Live Concert) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ ‘ఆరెంజ్ స్ట్రీట్’, ‘త్రీఓరి’ (Threeory) ల ప్రదర్శనలు ప్రత్యేక వినోదాన్ని పంచనున్నాయి.
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” వేడుకలకు సర్వం సిద్ధమైంది. నార్త్ కరోలినాలోని ‘షార్లెట్ కన్వెన్షన్ సెంటర్’ (Charlotte Convention Center) వేదికగా 2026 జులై 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ప్రధాన ఆకర్షణ.. ఈ వేడుకల్లో భాగంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి గారి ‘లైవ్ కాన్సర్ట్’ (MM Keeravani Live Concert) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ ‘ఆరెంజ్ స్ట్రీట్’, ‘త్రీఓరి’ (Threeory) ల ప్రదర్శనలు ప్రత్యేక వినోదాన్ని పంచనున్నాయి. అలాగే ‘పరంపర’ , ‘గ్రెగరీ హ్యాన్కాక్ డాన్స్ థియేటర్’ బృందాలచే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరగనున్నాయి.
ఈ కన్వెన్షన్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీటీఏ అవార్డుల ప్రదానం, శ్రీనివాస కళ్యాణం, సీఎంఈ (CME), బిజినెస్ సెమినార్లు, స్టార్టప్ ఫోరమ్, ఉమెన్స్ ఫోరమ్, యూత్ ఫోరమ్, బ్యూటీ పేజెంట్, వెండార్ స్టాల్స్, పొలిటికల్ ఫోరమ్ , మాట్రిమోనీ వంటి వైవిధ్యభరితమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి , అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఈ వేడుకను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి గల వారు కన్వెన్షన్ అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరారు.