
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్లో సంచలన రికార్డు నమోదు చేశాడు. డార్విన్ లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ వికెట్ తీయడం ద్వారా స్టార్క్ ఈ ఘనత సాధించాడు. తొమ్మిదో ఓవర్లో బౌలర్ నాథన్ క్యాచ్ తో ఈ వికెట్ పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మిచెల్ స్టార్క్ ఖాతాలో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ రంగన హేరాత్ పేరిట ఉన్న 433 వికెట్ల రికార్డు సమంగా ఉండేది. కానీ షాద్మాన్ ఇస్లామ్‌ను అవుట్ చేయడంతో తన వికెట్ల సంఖ్యను 434కి పెంచుకున్నాడు. దీంతో హేరాత్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. స్టార్క్ ఇప్పటివరకు 106 టెస్టుల్లో 434 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును కూడా స్టార్క్ సమం చేశాడు. కపిల్ దేవ్ 1978 నుండి 1994 మధ్య 131 మ్యాచ్‌ల్లో 434 వికెట్లు తీయగా, స్టార్క్ ఆయన కంటే 25 మ్యాచ్‌లు తక్కువగా ఆడి అదే వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. 36 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైమ్ టాప్ 10 అత్యధిక వికెట్ల వీరుల జాబితాలోకి ప్రవేశించడానికి కేవలం ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 10వ స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ ఉన్నాడు. స్టెయిన్ 93 టెస్టుల్లో 439 వికెట్లు పడగొట్టాడు. మరొక ఆరు వికెట్లు తీస్తే స్టార్క్, స్టెయిన్ రికార్డును దాటి టాప్ 10 లోకి ప్రవేశిస్తాడు. కాగా, క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్టార్క్ అక్టోబర్ 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. క్రికెట్లోని మూడు ఐసీసీ ప్రధాన ట్రోఫీలు (వన్డే