రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అధిక నీటి వినియోగం అవసరమయ్యే వరి, మిర్చి పంటలు సాగు చేయవద్దని రైతులకు సూచించారు. అనంతపురం కలెక్టరేట్లో మంగళవారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో సాగునీటి పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులకు నీటి కేటాయింపులు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పయ్యావుల.. ఎల్ నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు.1994 నుంచి తనకు HLC కాలువతో అనుబంధం ఉందని.. మూడు దశాబ్దాల అనుభవంలో ఇంతటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పయ్యావుల తెలిపారు. సాగుకు నీరు అందించడంపై ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని, రెండు నెలల కిందటే ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించామని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు దెబ్బతింటే, చరిత్రలో నిలిచిపోయేలా ఒకే సీజన్లో డ్యామ్‌కు ఉన్న 33 గేట్లను మార్చి రికార్డు సృష్టించామన్నారు. హెచ్ఎల్సీలో ఎనిమిది బ్రిడ్జిలు కూలిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా మారితే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న పయ్యావుల కేశవ్.. కొత్త బ్రిడ్జిలను నిర్మించామని తెలిపారు.మరోవైపు కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జూలై 31, 2027 వరకు సరిపడా నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ముందుగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీటికి కేటాయింపులు చేసిన తర్వాతే చెరువులకు నీరు అందించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి, మిర్చి పంటలు సాగు చేయవద్దన్న మంత్రి..ఈసారి వరి, మిర్చి పంటలకు నీరు అందించే అవకాశం లేదని, ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాగునీటి వినియోగం