
ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, తన అర్ధాంగి నారా బ్రహ్మణితో కలిసి అమెరికాలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. గ్లోబల్ ఎన్నారై చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహం అమెరికాలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకేశ్ దంపతులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా నూతన వధూవరుల వద్దకు వెళ్లి మంత్రి లోకేశ్, నారా బ్రహ్మణి వారిని మనసారా ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో లోకేశ్ దంపతులు సంప్రదాయ దుస్తులలో కనిపించారు. కార్యక్రమానికి వచ్చిన పలువురితో వారు కాసేపు ముచ్చటించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
.