
హైదరాబాద్: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ఇచ్చిన షోకాజ్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీఏసీ వివరణ కోరిన విషయం తెలిసిందే. దీంతో కొండా సురేఖ స్పందిస్తూ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. ‘‘నా కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. సుస్మిత వ్యాఖ్యల వ్యవహారంలో నా ప్రమేయం లేదని గుర్తించాలి. సుస్మిత వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు. నాకు సంబంధం లేని అంశంలో నా వివరణ కోరడం సముచితం కాదు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ నియమావళిపై నాకు గౌరవముంది. షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలి’’అని కొండా సురేఖ పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే
.