Basic Pay: ఉద్యోగుల కనీస వేతనాలు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగుల బేసిక్ పే అంశంపై చాలా అంచనాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం (Minimum Basic Pay), అలవెన్సులు, పెన్షన్ గణనీయంగా పెంచుతూ వస్తోంది. స్వాతంత్య్రానికి ముందే ఏర్పాటైన 1వ వేతన సంఘం నుంచి నేటి 7వ వేతన సంఘం వరకు రూ.55 గా ఉన్న కనీస బేసిక్ పే నేటు రూ.18000లకు ఎలా చేరిందో ఈ కతనం ద్వారా తెలుసుకుందాం. 1వ వేతన సంఘం: 1946లో ఒకటవ వేతన సంఘం అమలులోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల కనీస వేతనం రూ.55 మాత్రమే. స్వాతంత్య్రానికి ముందు ప్రారంభ వేతన ప్రమాణాలు నిర్దేశించారు. 2వ వేతన సంఘం: 1959లో రెండో వేతన సంఘం అమలులోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.80కి పెంచారు. జీవన వయ్యానికి అనుగుణంగా బేసిక్ పే స్వల్పంగా పెంచారు. 3వ వేతన సంఘం: 1973లో మూడో వేతన సంఘం అమలులోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల బేసిక్ పేను రూ.196కు పెంచారు. కరువు భత్యం (Dearness Allowance-DA), ఇతర అలవెన్సుల అనుసంధానం చేశారు. 4వ వేతన సంఘం: 1986లో నాలుగో వేతన సంఘం అమలులోకి వచ్చింది. ఉద్యోగుల కనీస వేతనాన్ని ఒక్కసారిగా రూ.750కి పెంచారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణంలో తొలిసారి భారీ పెరుగుదల నమోదు అప్పుడే జరిగింది. 5వ వేతన సంఘం: 1996లో 5వ వేతన సంఘం అమలులోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.2,550కి పెంచారు. పే స్కేళ్ల సంఖ్యను తగ్గించి, జీతాల నిర్మాణాన్ని సరళీకరించారు. 6వ వేతన సంఘం: 2006లో ఆరవ వేతన సంఘం అమలులోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల బేసిక్ పేను రూ.7000లకు