
Lionel Messi jersey : ఫుట్‌బాల్ ప్రపంచంలో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మధ్య పోటీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. వారిద్దరూ మైదానంలోకి దిగారంటే ఫుట్‌బాల్ అభిమానులకు పూనకాలు వచ్చినట్లే. మైదానంలో నువ్వానేనా అన్నట్లు పోటీపడే ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. వేలంలోనూ పోటీ పడ్డారు. అయితే, ఇందులో మెస్సీ విజయం సాధించాడు. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే వద్ద భద్రపరిచిన ఫుట్‌బాల్ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది. 2012 సంవత్సరంలో బార్సింలోనా – మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బార్సిలోనా తరపున మెస్సీ ధరించిన జెర్సీకి ప్రస్తుతం వేలం జరిగింది. మరోవైపు.. క్రిస్టియానో రొనాల్డో జెర్సీని కూడా వేలం వేయగా.. మెస్సి జెర్సీ అత్యధిక ధర పలికింది. మెస్సీ ధరించిన, సంతకం చేసిన 2012 బార్సిలోనా జెర్సీ 66,107 అమెరికన్ డాలర్లకు (సుమారు రూ.56.4 లక్షలు) వేలంలో విక్రయమైంది. అదే సేకరణలో ఉన్న రొనాల్డో రియల్ మాడ్రిడ్ జెర్సీ 10,601 డాలర్లకు (సుమారు రూ.9.05 లక్షలు) అమ్ముడైంది. దీంతో మెస్సీ జెర్సీ రొనాల్డో జెర్సీ కంటే ఆరు రెట్లకు పైగా ఎక్కువ ధర పలికింది. మెస్సీ జెర్సీ 2012 ఆగస్టులో మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన బార్సిలోనా ప్రీ-సీజన్ స్నేహపూర్వక మ్యాచ్‌లో ఆయన ధరించినదిగా పేర్కొన్నారు. ఆ మ్యాచ్ అనంతరం మెస్సీ ఈ జెర్సీపై సంతకం చేసి.. అప్పటి మాంచెస్టర్ యునైటెడ్ మసాజర్ రాడ్ థార్నీకి ఇచ్చాడు. మ్యాచ్‌లో ధరించినదిగా ఉండటంతో పాటు మెస్సీ సంతకం ఉండటం దాని విలువను మరింత పెంచింది. రొనాల్డో జెర్సీ 2014-15 సీజన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ మ్యాచ్-ఇష్యూడ్ షర్ట్. అయితే, అది మ్యాచ్ కోసం సిద్ధం చేసినప్పటికీ రొనాల్డో స్వయంగా ధరించినది కాదని సమాచారం. మెస్సీ జెర్సీ వెనుక ఆసక్తికర కథ ఉంది. 2012లో బార్సిలోనా జట్టు మాంచెస్టర్ యునైటెడ్‌తో ప్రీ-సీజన్