
యదార్థ సంఘటనల ఆధారంగా షకలక శంకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మేరంగి జంక్షన్’. 47 రోజుల్లో టాకీ షూటింగ్ పూర్తి కాగా, 2026 చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులకు విభిన్నమైన కథాంశాలతో కూడిన థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న మరో ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మేరంగి జంక్షన్’. షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శివ గణేష్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. రవి కృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయుని, పెద్దింటి మోహన రావు, చొక్కపు రాములమ్మ, సీర గణపతి నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్, ప్రభాకర్, రాధా కోహినూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘మేరంగి జంక్షన్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక పాట, ఒక ఫైట్ మినహా టాకీ షూటింగ్ కంప్లీట్ చేశారు. మొత్తం 47 రోజుల్లో టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణను పూర్తి చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మేరంగి అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చిత్రబృందం తెలిపింది. అక్కడ చోటుచేసుకునే సంఘటనల చుట్టూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా కథను తెరకెక్కిస్తున్నట్లు పేర్కొంది. యదార్థ సంఘటనల సమాహారంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనుభూతిని అందిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో షకలక శంకర్ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇంతవరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో సీరియస్ లుక్‌తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా ఆయన పాత్రలో నట విశ్వరూపం చూపించనున్నారని చిత్రబృందం వెల్లడించింది. మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో