
ఇంటర్నెట్ డెస్క్: నెదర్లాండ్స్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. పూల్ డిలో వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సేన 3-1 తేడాతో విజయం సాధించింది. భారత్‌కు మొత్తం ఐదు పెనాల్టీ కార్నర్లు లభించగా.. మూడింటిని గోల్స్‌గా మార్చింది. తొలి క్వార్టర్లో సంజయ్ (8వ నిమిషం) గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. తర్వాత హర్మన్‌ప్రీత్ గోల్‌తో (11వ నిమిషం) భారత్ మరింత ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో ఇరుజట్లూ ఒక్క గోల్ చేయలేకపోయాయి. మూడో క్వార్టర్లో హర్మన్‌ప్రీత్ తన రెండో గోల్ (43వ నిమిషం) చేయడంతో భారత్ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. వేల్స్ తరఫున 56వ నిమిషంలో సామ్ వెల్ష్ గోల్ చేశాడు. ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.