
ఉమ్మడి జిల్లాలో ఇష్టారాజ్యంగా యాసంగి సీజన్ కేటాయింపులు విద్యుత్తు కనెక్షన్ లేని దుబ్బాక మిల్లులో ధాన్యం నిల్వలు ఈనాడు, సంగారెడ్డి: ఉమ్మడి జిల్లాలో గత యాసంగి సీజన్లో అంచనాలకు మించి ధాన్యం సేకరించారు. మిల్లుల్లో నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడంతో మార్కెట్ గోదాంలతో పాటు ఇతర ప్రైవేటు స్థలాల్లో అన్లోడ్ చేశారు. ఇదే అదునుగా కొందరు అనుమతుల పేరిట నూతనంగా నిర్మిస్తున్న మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేసుకున్నారు. వీటితో పాటు మార్కెట్, ప్రైవేటు గోదాంల్లో నిల్వ చేసిన వాటిల్లో భారీగా తేడాలు వెలుగు చూస్తున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని ఘటనలే ఇందుకు నిదర్శనం. మూడు జిల్లాల్లోని మిల్లుల్లో తనిఖీలు చేస్తే వాస్తవాలు బయటకు రానున్నాయి. దుబ్బాకలో నూతనంగా నిర్మాణం చేస్తున్న మిల్లులో యంత్రాలను బిగిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు మార్కెట్ కమిటీ నుంచి లైసెన్స్ లేకుండానే ధాన్యం కేటాయించారు. ఓపీఎంఎస్లో నమోదుకావడంతో కేటాయించామని అధికారులు పేర్కొంటున్నారు. అందుబాటులోకి రాకముందే ఏ విధంగా నమోదైందనే దానిపై విచారణ చేస్తున్నామని సిద్దిపేట అదనపు కలెక్టర్(రెవెన్యూ) లక్ష్మీకిరణ్ ‘ఈనాడు’కు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో సన్నధాన్యం కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు మిల్లర్లు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు