
సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ నిండు గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలంలోని బదరి గూడెం గ్రామానికి చెందిన అనిత (30) తొలి కాన్పు కోసం గత మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఆమె మృతి చెందగా కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందారని ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వివరాలు సేకరించారు. ఆమె గుండె పోటు వల్ల మృతి చెందారని ఆస్పత్రి ఆర్ఆర్ఎమ్వో రవి కుమార్ చెప్పారు. పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.