© 2026 nimisham.in
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. పాపం ఈ స్కూల్ పిల్లలు ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్ పరిధిలోని దావల్ ఆక్సిడెంటల్ ప్రావిన్స్, మలితా ప్రాంతంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. ఈ విపత్తు సంభవించిన సమయంలో అక్కడి మహాయహాయ్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉదయం ఫ్లాగ్ సెరిమనీ నిర్వహిస్తున్నారు. జెండా వందనం జరుగుతుండగా ఒక్కసారిగా భూమి భారీగా కంపించడంతో పాఠశాల ప్రాంగణంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం ధాటికి విద్యార్థులు నిలబడలేక ఊగిపోయారు. అదే సమయంలో పిల్లలు అసెంబ్లీ అయిన స్థలం వెనుక ఉన్న ఒక చిన్న ఆశ్రయం లేదా షెడ్ లాంటి నిర్మాణం కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదాన్ని గ్రహించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై... విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ వార్తకు సంబంధించిన