© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. OnePlus Amazon Prime Day Sale: మీరు కొత్త వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీకు ఒక అద్భుతమైన అవకాశం రానే వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale)లో ప్రముఖ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) స్మార్ట్ఫోన్లపై దిమ్మతిరిగే ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా భారీ బ్యాంక్ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. వన్‌ప్లస్ లేటెస్ట్ మోడల్స్ అయిన వన్‌ప్లస్ 15R, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13sతో పాటు నార్డ్ CE 6 వంటి ఫోన్లపై కంపెనీ ఏకంగా రూ.18,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన కార్డులను (SBI, Axis Bank) వినియోగించి ఈఎంఐ (EMI) లేదా ఫుల్ పేమెంట్ చేసి కొనుగోలు చేస్తే.. 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.. వీటితో పాటు నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండడం విశేషం. అంతేకాకుండా కొన్ని మోడల్స్‌పై దిమ్మతిరిగే ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వన్‌ప్లస్ 15R (OnePlus 15R)పై భారీ బంపర్ ఆఫర్.. OnePlus కంపెనీకి చెందిన ప్రీమియం మోడల్ వన్‌ప్లస్ 15R అసలు ధర (MRP) రూ.68,999 కాగా.. ఈ అమెజాన్ సేల్‌లో ఏకంగా రూ.58,999కే అందుబాటులో ఉండడం విశేషం.. దీనికి తోడు బ్యాంక్ కార్డు ఆఫర్స్‌తో పాటు EMI ట్రాన్సాక్షన్‌పై అదనంగా రూ.3,300 వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే మొత్తంగా ఈ
ఫోన్‌పై దాదాపు రూ.13,000 వరకు ఆదా అవుతుంది. ఇది 16GB ర్యామ్‌తో పాటు గరిష్టంగా 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఏకంగా 7,400mAh భారీ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది..
వన్‌ప్లస్ 13 పై రూ.18,000 డిస్కౌంట్.. ఈ సేల్‌లో అత్యధిక తగ్గింపు లభిస్తున్న ఫోన్ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్.. దీని అసలు MRP ధర రూ.72,999 కాగా.. అమెజాన్ సేల్‌లో కేవలం రూ.54,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో కొనుగోలు చేస్తే.. మరో రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను MRP కంటే రూ.18,000 తక్కువ ధరకే పొందవచ్చు.
రూ.50 వేల లోపు ధరలో వన్‌ప్లస్ 13s.. రూ.57,999 MRP కలిగిన వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో రూ.49,999 ధరకే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో EMIలో కొనుగోలు చేస్తే.. మరో రూ.4,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ మోడల్లో 12GB ర్యామ్, 5,850mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
బడ్జెట్ ధరలో వన్‌ప్లస్ నార్డ్ CE 6.. మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునేందుకు వన్‌ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ 22 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.40,999 MRP ధరతో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను సేల్‌లో కేవలం రూ.31,998కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 144Hz రిఫ్రెష్ రేట్, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు ఇది మోస్ట్ పవర్ఫుల్ 8,000mAh బ్యాటరీతో లభిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.