
భారతీయ కార్ల మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు.. రికార్డు సేల్స్ తో మరోసారి ఇద నిరూపితమైంది. జులై 2026లో ఈ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ సేల్స్ నమోదు చేసింది. చాలా కాలం తర్వాత హ్యాచ్‌బ్యాక్ కార్ల మొత్తం మంత్లీ సేల్స్ 1 లక్ష యూనిట్ల మార్కును దాటేశాయి. జులై 2026లో దేశంలో ఏకంగా 1,07,602 హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది అంటే జులై 2025లో ఈ సంఖ్య 74,475 యూనిట్లుగా మాత్రమే ఉండేది. అంటే ఏడాది కాలంలో అమ్మకాలు 33,127 యూనిట్లు పెరిగి, వార్షికంగా 44.48 శాతం గ్రోత్ నమోదు చేశాయి. స్టార్టింగ్ ప్రైస్ రూ. 4.99 లక్షలు ఉన్న మారుతి సుజుకి వాగన్ ఆర్ (WagonR) అమ్మకాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జులై 2026లో కంపెనీ 23,338 వాగన్ ఆర్ కార్లను విక్రయించింది. జులై 2025లో సేల్ అయిన 14,710 యూనిట్లతో పోలిస్తే ఇది 58.65 శాతం పెరుగుదల. మొత్తం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో వాగన్ ఆర్ షేర్ 21.69 శాతంగా ఉంది. తక్కువ ధర, మంచి మైలేజ్, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండటంతో యూజర్లు ఈ కారును తెగ ఇష్టపడుతున్నారు. రెండో స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ నిలిచింది. జులై 2026లో స్విఫ్ట్ 21,538 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జులైలో అమ్మిన 14,190 యూనిట్లతో పోలిస్తే ఇది 51.78 శాతం గ్రోత్. స్పోర్టీ డిజైన్, ఫీచర్ల కారణంగా ఈ కారు 20 శాతం మార్కెట్ షేర్ సాధించింది. ఇక మూడో స్థానంలో మారుతి బలేనో నిలిచింది. జులై 2026లో బలేనో 18,241 యూనిట్ల సేల్స్ సాధించి 45.89 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. బలేనో మార్కెట్ షేర్ 16.95 శాతంగా ఉంది. ఈ సేల్స్ రిపోర్ట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది మారుతి ఆల్టో. జులై 2026లో ఆల్టో 12,534 యూనిట్లు అమ్ముడయ్యాయి