© 2026 nimisham.in

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి, తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వస్తోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, రాబోయే ఐదారు సంవత్సరాల్లో ఏకంగా 7 కొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు, పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్ల మేర పెంచుకున్నట్లు వెల్లడించింది.సంస్థ 2025-26 వార్షిక నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది. మధ్యకాలిక వృద్ధిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగవంతంగా విస్తరించామని కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే 5 లక్షల యూనిట్ల అదనపు తయారీ సామర్థ్యాన్ని జోడించామని ఆయన వివరించారు. ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త మోడళ్లను పరిచయం చేయనున్నట్లు స్పష్టం చేశారు.కంపెనీ ఛైర్మన్ ఆర్.సి. భార్గవ భారత కార్ల మార్కెట్ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమ 6.1 - 6.3 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా, గత ఐదేళ్లతో పోలిస్తే చిన్న కార్ల సెగ్మెంట్ కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.మారుతీ సుజుకి ఇటీవల అద్భుతమైన పనితీరును కనబరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 24.22 లక్షల వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. ఇందులో 4.47 లక్షల వాహనాల ఎగుమతులు కూడా ఉన్నాయి. వరుసగా మూడో ఏడాది