
మార్కాపురం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ టవర్లు, కరెంట్ స్థంభాలు, చెట్లు నేలకూలాయి. పుల్లలచెరువు మండలం మురికిమళ్ళ తండాలో గంట పాటు భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పొలంలోని 220 కెవి విద్యుత్ టవర్ విరిగి పడింది. ఆ పొలంలో అప్పటి వరకు నలభై మంది కూలీలు పని చేస్తూ ఉన్నారు. జోరుగా వర్షం పడుతుండటంతో పనులు ఆపేసి ఇళ్ళకు వెళ్ళి పోయారు. కూలీలు వెళ్ళిన కొద్ది సేపటికి భారీ విద్యుత్ టవర్ నేలకూలింది. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని రైతు బాలు నాయక్ తెలిపారు. భారీ విద్యుత్ టవర్ కూలిపోవడంతో పొలంలోని మిర్చి మొక్కలు పాడై పోయాయి. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, స్తంభాలు పడిపోయాయని రైతు వాపోయాడు. తనకు జరిగిన నష్ పై అధికారులు స్పందించి న్యాయం చెయ్యాలని రైతు బాలు నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Found this helpful?
Share this story with your network









