
కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా పేరును 'చంద్రన్న మార్కాపురం'గా మార్చాలనే ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇది మార్కాపురం ప్రజల చిరకాల ఆకాంక్ష అని చెబుతూ, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సోమవారం ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన కోరారు.గత ఏడాది (2025) డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురం, పోలవరంలను కొత్త జిల్లాలుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి చేరింది. అప్పటి నుంచి మార్కాపురం జిల్లా కేంద్రంగా పరిపాలన కొనసాగుతోంది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గడిచిన రెండేళ్ల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం సుమారు రూ. 2,391 కోట్లు ఖర్చు చేసింది.ముఖ్యంగా, దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫీడర్ కెనాల్ పనుల కోసం రూ. 456 కోట్లు, ముంపు గ్రామాల పునరావాసానికి రూ. 906 కోట్లు కేటాయించి పనులను ముందుకు నడిపిస్తోంది. వీటితో పాటు చెక్ డ్యామ్లు, నీటి సంరక్షణ పనులతో సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తోంది.మరోవైపు పర్యాటక రంగంలోనూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మార్కాపురం, త్రిపురాంతకం వంటి ఆలయాలతో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని, కంబం చెరువు వద్ద బోటింగ్, కాటేజీలతో జల పర్యాటకాన్ని, నల్లమల అటవీ ప్రాంతంలో