
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటుడు సుహాస్, విలక్షణ కథానాయకుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘మండాడి’. ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్ని మేకర్స్ వదిలారు. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas), విలక్షణ కథానాయకుడు సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘మండాడి’ (Mandaadi). ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, తాజాగా సుహాస్ పుట్టినరోజు (Suhas Birthday Special) సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ బర్త్‌డే పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ స్పెషల్ పోస్టర్లో సుహాస్ మునుపెన్నడూ చూడని విధంగా ఊరమాస్, ఇంటెన్స్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన సరికొత్త మేకోవర్, చేతికి ఉన్న ఉంగరం, గడియారంతో పాటు.. ఆయన చూపులు చూస్తుంటే సినిమాలో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌కి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ‘సుహాస్ ఏంటి ఇలా మారిపోయాడు!’ అంటూ అభిమానులు ఈ ఇంటెన్స్ లుక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, అద్భుతమైన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో సాగే బోట్ సీక్వెన్స్ రోమాంచితంగా ఉండబోతున్నాయని సమాచారం. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ వంటి టాప్ ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి భారీ సాంకేతిక బలాన్ని