© 2026 nimisham.in

శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్లు పోరాడినా.. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (4/76, 6/55) పది వికెట్ల మాయాజాలంతో టీమిండియాకు 600వ టెస్ట్‌లో అద్భుత విజయాన్ని అందించాడు... తొలి సెషన్లో ఎదురు నిలిచినా..: టాపార్డర్‌ను కూల్చినా.. మిడిలార్డర్ నుంచి ప్రతిఘటన ఎదురవడంతో విజయం కోసం భారత్ ఓపిగ్గా ఎదురు చూడాల్సి వచ్చింది. నిన్నటి బ్యాటర్లు ధనంజయ డిసిల్వ, సోనాల్ దినుష సిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును నడిపించారు. ఈ క్రమంలో ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్న డిసిల్వను జడేజా అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నిరోషన్ డిక్వెల్లా (10)ను జైస్వాల్ మాటలతో కవ్వించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన డిక్వెల్లా.. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో చెత్తషాట్‌కు అవుటయ్యాడు. ఈ దశలో సోనాల్‌కు కేశర (20) జత కలవడంతో లంక 175/6తో లంచ్‌కు వెళ్లింది. తిరిగొచ్చాక మానవ్ సుతార్ 76వ ఓవర్లో 3 వికెట్లతో లంక పనిబట్టాడు. తొలుత శతకం దిశగా సాగుతున్న సోనాల్‌ను క్యాచవుట్ చేసిన మానవ్.. ప్రభాత్ (0), లాహిరు కుమార (0)ను అవుట్ చేశాడు. ఆఖరుగా కేశరను కూడా సుతార్ పెవిలియన్ చేర్చాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: నిషాన్ (సి) ప్రసిద్ధ్ (బి) సిరాజ్ 6, లాహిరు ఉదార (సి) జురెల్ (బి) సుతార్ 16, పసిందు (ఎల్బీ) సుతార్ 0, కమిందు (సి) రాహుల్ (బి) ప్రసిద్ధ్ 2, ధనంజయ (సి) సుతార్ (బి) జడేజా 59, సోనాల్ (సి) జురెల్ (బి) సుతార్ 84, డిక్వెల్లా (సి) పంత్ (బి) ప్రసిద్ధ్ 10, కేశర (బి) సుతార్ 20, ప్రభాత్ (బి) సుతార్ 0, లాహిరు (సి) పంత్ (బి) సుతార్ 0, ఫెర్నాండో (నాటౌ ట్) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 77.4 ఓవర్లలో 206 ఆలౌట్; వికెట్ల పతనం: 1-13, 2-14, 3-21, 4-47, 5-142, 6-156, 7-199, 8-199, 9-199, 10-206; బౌలింగ్: సిరాజ్ 9-2-15-1, మానవ్ 23.4-2-55-6, ప్రసిద్ధ్ 10-3-16-2, జడేజా 23-3-71-1, కుల్దీప్ 11-0-38-0, దేవ్‌దత్ 1-0-5-0. శ్రీలంకలో ఆ జట్టుపై భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ టెస్ట్ ఇన్నింగ్స్ గణాంకాల్లో మానవ్ సుతార్ (6/55)ది రెండోస్థానం. రవిచంద్రన్ అశ్విన్ (6/46) ముందున్నాడు. 600 టెస్ట్‌లు ఆడిన మూడో జట్టుగా భారత్. 300వ, 400వ, 500వ మైలురాయి టెస్టుల్లో నెగ్గిన టీమిండియా.. ఇప్పుడు 600వ టెస్ట్‌లో కూడా విజయభేరి మోగించింది. శ్రీలంకలో భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం. 2015లో చివరిసారి గాలెలో మనోళ్లు ఓడారు.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ట్రోఫీతో దేవ్‌దత్ పడిక్కళ్ తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్