
ఇప్పటివరకు మలేరియా నియంత్రణలో ప్రధానంగా దోమలను చంపడంపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ ఆలోచనకు భిన్నమైన మార్గాన్ని పరీక్షించారు. దోమను చంపకుండా.. దాని శరీరంలోకి వెళ్లిన మలేరియా పరాన్నజీవిని అడ్డుకునే రసాయనాలతో దోమతెరలను తయారు చేసే అవకాశాన్ని పరిశీలించారు.పాత పద్ధతికి సవాల్మలేరియా నియంత్రణలో ఇన్సెక్టిసైడ్ ట్రీటెడ్ బెడ్ నెట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. దోమతెరను తాకిన దోమలను క్రిమిసంహారకాలు చంపడం లేదా నిర్వీర్యం చేయడం ద్వారా మనుషులకు మలేరియా సోకకుండా అడ్డుకుంటాయి. అయితే కాలక్రమేణా కొన్ని ప్రాంతాల్లో దోమలు ఈ క్రిమిసంహారకాలకు నిరోధకతను పెంచుకుంటున్నాయి. దీంతో పాత పద్ధతి ప్రభావం తగ్గుతోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కారణంగా 26.3 కోట్ల కేసులు, 5.97 లక్షల మరణాలు నమోదైనట్లు అధ్యయనం పేర్కొంది.పరాన్నజీవిని టార్గెట్ చేస్తే?ఇక్కడే కొత్త పరిశోధన ఆసక్తికరంగా మారింది. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు అనుబంధ పరిశోధకుల నేతృత్వంలోని 2025 అధ్యయనంలో దోమను చంపడం కాకుండా.. దోమలో పెరిగే ‘ప్లాస్మోడియం ఫాల్సిపేరం’ పరాన్నజీవిని లక్ష్యంగా చేసుకున్నారు.మలేరియా సోకిన రక్తాన్ని పీల్చిన తర్వాత పరాన్నజీవి కొంతకాలం దోమ శరీరంలోనే అభివృద్ధి చెందుతుంది. చివరకు దోమ లాలాజల గ్రంథులకు చేరిన తర్వాత మరో మనిషిని కుట్టినప్పుడు మలేరియా వ్యాప్తి చెందుతుంది. ఈ మధ్యంతర దశనే పరిశోధకులు లక్ష్యంగా చేసుకున్నారు.81 సమ్మేళనాల పరీక్షపరిశోధకులు మలేరియాపై ఇప్పటికే తెలిసిన 81 సమ్మేళనాలను పరీక్షించారు. ఇవి 28 రకాల విధానాల్లో పరాన్నజీవిపై పనిచేసే రసాయనాలు. వీటిలో 22 సమ్మేళనాలు మలేరియా పరాన్నజీవి అభివృద్ధిని గణనీయంగా అడ్డుకున్నాయి.వాటిలో ELQ-453