
ఇప్పటి వరకూ కదులుతున్న బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఈ లిస్ట్‌లోకి రైలు కూడా చేరింది. మీరు విన్నది నిజమే. ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు చక్కాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస రోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ పై పెను ప్రమాదం తప్పింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీ చక్రాలు రెండు జాయింట్ గా ఊడిపోయాయి.రైలు కదులుతుండగానే ఈ ఘటన జరగటంతో ఊడిపోయిన చక్రాలు రెండు పట్టాలపై నుంచి బయటకు వచ్చేసాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు, సాంకేతిక బృందాలు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన కారణంగా రైల్వే మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సమయానికి సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్ రేసులో దూసుకెళ్తున్న మాస్టర్ బ్లాస్టర్ తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్డేట్ తెలుసుకోవాల్సిందే