
మహీంద్రా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత మార్కెట్లోకి వచ్చింది. బీఈ6 స్పోర్టెక్ పేరుతో విడుదలైన ఈ మోడల్ ప్రారంభ ధర రూ.11.45 లక్షలు. ఇది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) పథకం ధర. బీఏఏఎస్ లేకుండా ప్రారంభ ధర రూ.19.45 లక్షలుగా ఉంది. కొత్త మోడల్లో డిజైన్ మార్పులతో పాటు టెక్నాలజీ, డ్యాష్బోర్డ్లోనూ కీలక మార్పులు చేశారు. లాంచ్ ఎడిషన్, ఫోర్, ఎఫ్ఈ, ఎఫ్ఈ ఫోర్ వంటి ప్రత్యేక వేరియంట్లను అందుబాటులోకి తెచ్చారు.బీఈ6 స్పోర్టెక్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది. ‘వన్’ వేరియంట్ 59kWh బ్యాటరీతో బీఏఏఎస్ ధర రూ.11.45 లక్షలు కాగా.. సాధారణ ధర రూ.19.45 లక్షలు. ‘టూ’ ధరలు వరుసగా రూ.12.95 లక్షలు, రూ.20.95 లక్షలు. ‘త్రీ’ ధర రూ.21.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ‘త్రీ+’ ధర రూ.23.95 లక్షల నుంచి ఉంది. ఫోర్, లాంచ్ ఎడిషన్, ఎఫ్ఈ ఫోర్ ధర రూ.26.95 లక్షలు కాగా.. ఎఫ్ఈ వేరియంట్ ధర రూ.24.45 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.కొత్త బీఈ6 స్పోర్టెక్లో బయట డిజైన్ పెద్దగా మారలేదు. లాంచ్ ఎడిషన్‌లో ప్రత్యేక పెయింట్ స్కీమ్ ఇచ్చారు. వెనుక భాగంలో లాంచ్ ఎడిషన్ బ్యాడ్జ్, బీఈ6 లెటరింగ్ ఉన్నాయి. వెనుక లైట్ల సాయంతో టెయిల్‌గేట్‌పై సందేశాలను ప్రదర్శించే సదుపాయం కూడా ఉంది. మొత్తం 12 రంగుల్లో ఈ ఎస్యూవీ లభిస్తుంది. వీటిలో రోసో ఇంపల్సో, రూబీ వెల్వెట్, గ్రాఫైట్ స్టోర్మ్, ఫైర్‌స్టార్మ్ ఆరెంజ్ సాటిన్ అనే నాలుగు కొత్త రంగులు ఉన్నాయి