
ఆస్తి కోసం కన్న తండ్రి మృతదేహాన్నే అడ్డంగా పెట్టుకున్నాడో కొడుకు. బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోలేదు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా వదల్లేదు. మృతదేహం వేలిని పట్టుకుని ఖాళీ కాగితాలపై వేలిముద్ర వేయించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలోని ఖరౌహా గ్రామంలో చోటుచేసుకుంది.75 ఏళ్ల ఛత్రపాల్ తన కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మి వేధింపులు భరించలేక కొంతకాలంగా కుమార్తెల వద్ద ఉంటున్నారు. 2023లో మహేంద్ర, లక్ష్మి తన తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఛత్రపాల్ కుమార్తె సుమన్ ఆరోపించారు. దీంతో ఆయన బంధువుల వద్ద, అనంతరం తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ వచ్చారు.ఆస్తిని కుమార్తెలకు పంచిన తండ్రితనను చూసుకున్న ముగ్గురు కుమార్తెలకు ఛత్రపాల్ తనకున్న భూమిని రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనను, తన భార్యను వేధించారనే కారణంతో కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మికి తన ఆస్తిలో ఏమాత్రం చెందదని పత్రికలో ప్రకటన కూడా ఇచ్చినట్లు కుటుంబం తెలిపింది.అయితే తండ్రి ఆరోగ్యం విషమించడంతో జులై 7న సుమన్ తన అన్న మహేంద్రకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబంతో కలిసి లక్నోకు వచ్చిన మహేంద్ర.. తండ్రికి చికిత్స చేయిస్తానంటూ ఆయన్ను గ్రామానికి తీసుకెళ్లాడు. రెండు రోజులకే ఛత్రపాల్ కన్నుమూశారు.తండ్రి చనిపోయినా..అంత్యక్రియల కోసం సుమన్, ఇతర కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడే వారికి ఊహించని దృశ్యం కనిపించింది. మృతిచెందిన ఛత్రపాల్ చేతి వేలిని పట్టుకున్న మహేంద్ర.. ఖాళీ కాగితాలపై ఆయన వేలిముద్ర తీసుకుంటున్నట్లు బంధువులు,




