
వెల్దండ : సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ ఈర్ల రఘువీర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం వెల్దండ పోలీస్ స్టేషన్లో మిలాద్ ఉన్ నబిని పండుగను పురస్కరించుకొని వెల్దండ, చారకొండ, వంగూరు మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా స్నేహ పూర్వక వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇప్పటికీ కులమతాలను పక్కన పెట్టి, వరసలతో పలకరించుకునే సంప్రదాయం కొనసాగుతుందన్నారు. వెల్దండ సర్కిల్ పరిధిలోని మూడు ఠాణాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా సహకరించాలన్నారు. ఈనెల 26 జరిగే మిలాద్ ఉన్ నబిని సాఫీగా జరుపుకోవాలని, ర్యాలీలు వంటివి ఉంటే ముందుస్తుగా అనుమతులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎస్సైలు యుగేందర్‌రెడ్డి, వీరబాబు, మాధవరెడ్డి, సర్పంచి అన్వర్ పాషా, నాయకులు చెన్నయ్య, రషీద్, మైనోద్దిన్, హమీద్, రాములు, ఖలీమ్, జావిద్, తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు