
పెబ్బేరులో ఓ దాబా వెనక గురువారం డీసీఎం నుంచి లారీలో లోడ్ చేస్తున్న రేషన్ బియ్యం పెబ్బేరును కేంద్రంగా చేసుకొని వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి భారీగా రేషన్ బియ్యం మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడే ట్యాగుల ఏర్పాటు, గన్ని బస్తాల్లో నింపి నేరుగా గోదాంలకు తీసుకెళ్తున్నారు. అక్కడ సాంకేతిక సహాయకులకు డబ్బులిచ్చి పాస్ చేయిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. పెబ్బేరు, న్యూస్టుడే : రేషన్ బియ్యం మాఫియా రూట్ మార్చింది.. గతంలో ఆటోలు, బొలెరో వాహనాల్లో తీసుకెళ్లే వారు.. ఇప్పుడు ఏకంగా డీసీఎంలు, లారీల్లో తరలిస్తున్నారు. అయినప్పటికీ వీరిని పట్టుకొనే నాథుడే లేరు. తెల్లవారుజామున తరలింపు.. : జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలో మండలస్థాయి పాయింట్, గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని అక్రమార్కులు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మిల్లులకు చేర వేస్తున్నారు. ఏడాదిన్నరలో 40 కేసులే.. : 2025 జనవరి నుంచి 2026 జులై వరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 40 కేసుల మాత్రమే జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. అవి కూడా స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులు పట్టుకొని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. స్థానిక పోలీసులు, సంబంధిత అధికారులు పట్టుకున్న దాఖలాలు లేవు. పట్టుబడిన 40 కేసుల్లో అత్యధికంగా 10 క్వింటాళ్లలోపే ఉన్నాయి. మొత్తం 430.43 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిఘా పెంచి తనిఖీలు చేస్తాం : నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం బియ్యం మిల్లుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సిబ్బంది అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. రేషన్ దందా ఎక్కడెక్కడ జరుగుతోందనే దానిపై ఆరా తీసి చర్యలు చేపడతాం. ఆంజనేయులు, పౌరసరఫరాల శాఖ అధికారి, వనపర్తి గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త