
బాజీపూర్‌లో నీటి గుంత వద్ద భాస్కర్‌రెడ్డి తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్: న్యూస్‌టుడే: పొలాల్లో నీటి గుంతలు తవ్వించి...రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తిమ్మాజిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రెండేళ్లుగా రైతులు నీటిని పొదుపుగా వాడుకుంటూ పంటలను పండిస్తున్నారు. బోర్లు, బావుల్లో తక్కువనీరుండటం, వాటి ద్వారా అరకొరగా నీరు వస్తుండటంతో ముందుగా నీటి గుంతల్ని నింపుతున్నారు. ఆ నీటిని మరో మోటారు సాయంతో పంటలకు నేరుగా... తుంపర, బిందు పద్ధతుల్లో ఉపయోగించి...చింత లేకుండా పండిస్తున్నారు. ఇదే మంచి తరుణం: ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తున్న ప్రస్తుత సమయంలో రైతులకు నీటి గుంతలు వరంగా మారాయని చెప్పొచ్చు. వీబీజీరాంజీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా నీటి గుంతను నిర్మించనున్నారు. చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. రైతు అవసరాన్ని బట్టి మూడు సైజులుగా కూలీలతో నిర్మించి ఇస్తారు. ఒక్కోటి ఆరులక్షల లీటర్ల నీరు నిలిచే సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు పదెకరాల పొలం ఉన్నప్పటికీ వాటిని నిర్మించి ఇచ్చేందుకు అవకాశం ఉంది. నీటి గుంత నిర్మించుకోవడంవల్ల పంటకు నీరందుతుందో లేదో అన్న బెంగ దూరమైంది. నాకున్న రెండుబోర్లలో నీటిశాతం తక్కువ. రెండు బోర్లనీటిని గుంతలోకి వదిలి మరో మోటారు ద్వారా వరి, మొక్కజొన్నకు పారించుకుంటున్నాను. నేటికి నాలుగు పంటలు పండించాను. బోరు పక్కనే గుంత తవ్వడం వల్ల రీఛార్జి అయ్యి... నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఐదెకరాలకు నీటి సమస్య తీరింది. గుంత తవ్వించుకున్న తర్వాత నాకు నీటి సమస్య అనేదే రాలేదు. ఎత్తైన ప్రదేశంలోకి కూడా నీటిని పారించుకుంటున్నాను. రెండుబోర్లద్వారా గుంతను నింపి ఉల్లి, పుచ్చ, మొక్కజొన్న పండిస్తున్నాను. మూడేళ్లుగా గుంతలోని నీటినే వాడుతున్నాను. అన్ని కాలాల్లోనూ పశువులకు తాగునీటి సమస్య ఏర్పడలేదు. -భాస్కర్‌రెడ్డి, రైతు, బాజీపూర్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ