
ఊట్కూరు: ప్రధాని మోదీ మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు భాజపా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం పది గంటల నుంచి రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. యువత, భాజపా నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో భాజపా నాయకులు డి. హనుమంతు, లక్ష్మణ్, రమేశ్‌, ఎం.భరత్, రణవీర్, తారా కృష్ణ, బి. రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.