
గట్టు: రాయపురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 83లో ఉన్న వ్యవసాయ భూములను అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కోసం కేటాయించవద్దని కోరుతూ స్థానిక రైతులు బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సుమారు 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం దళితులకు కేటాయించిన 50 ఎకరాల భూమిపైనే సుమారు 80 కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని వారు తెలిపారు. ఇటీవల గిర్దావర్, జీపీఓ, సర్వేయర్ తదితర అధికారులు వచ్చి ఈ భూమిని రీసెర్చ్ సెంటర్‌కు తీసుకుంటున్నట్లు చెప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు, బతుకుదెరువు ఈ భూమిపైనే ఆధారపడి ఉన్నందున పరిశోధనా కేంద్రానికి ఇతర ప్రాంతాల్లో భూమిని కేటాయించాలని, తమ జీవనాధారాన్ని కాపాడాలని తిప్పయ్య, నరసింహులు, వీరేష్ తదితర రైతులు విజ్ఞప్తి చేశారు. వినతితో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల నకళ్లను అధికారులకు అందజేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.