
వెల్దండ : సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా నిలుస్తోందని కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్క రాజశేఖర్ అన్నారు. వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి మౌనికకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 21 వేల చెక్కును ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. వెల్దండ మండలం చెర్కూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దాసరి బాలయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. అతని భార్య పెంటమ్మకు రూ.20 వేలను ఆర్థిక సాయంగా అందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





