
ఇంటర్నెట్ డెస్క్: నిషేధిత ఉత్పత్తులైన పాన్ మసాలాలకు పరోక్షంగా ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖ బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్‌గణ్ ( Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం-ఎఫ్‌డీఏ (Maharashtra FDA) షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, ఒక నిషేధిత ఉత్పత్తిని ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర స్థాయి ఆహార నియంత్రణ సంస్థకు చట్టపరమైన అధికారం ఉందా? అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. మరి దీనికి చట్టం ఏం చెబుతోంది? సూపర్స్టార్లకు నోటీసులు జారీ చేసిన తుకారాం ముంఢే (Tukaram Mundhe) ఎవరు..? ఇలాచీ పేరుతో ప్రసారమవుతోన్న ప్రకటనలో నటించినందుకు గానూ.. 2006 నాటి ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని 24, 53 సెక్షన్ల కింద ఎఫ్‌డీఏ.. ఈ సెలబ్రిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటన వల్ల నిషేధిత ఉత్పత్తికి పరోక్ష ప్రచారం జరుగుతోందా?అనేది తాము పరిశీలించనున్నామని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారం ముంఢే చెబుతున్నారు. ఈ ఉత్పత్తుల ప్రచారంలో మీ పాత్ర ఏమిటి? ప్రకటనకు ముందు ఉత్పత్తిపై, దాని చట్టబద్ధతపై ఎలాంటి పరిశీలన చేశారు? వంటి వాటిపై వివరణ ఇవ్వాలని నటులను ఎఫ్‌డీఏ ఆదేశించింది. తమ ఎండార్స్మెంట్ ఒప్పందాలు, క్యాంపెయిన్ వివరాలు, ఉత్పత్తి సమాచారం, చెల్లింపుల వివరాలు, ప్రకటన సంస్థ, బ్రాండ్ యజమాని తదితర సమాచారాన్ని సమర్పించాలని తెలిపింది. అలాగే, ఈ ప్రచార కంటెంట్‌ను తమ సోషల్ మీడియా ఛానెళ్ల నుంచి తొలగించాలని, తక్షణం ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై లిఖిత పూర్వక వివరణ ఇచ్చేందుకు ఈ నటులకు 15 రోజుల గడువు కల్పించింది. ఇలాంటి కేసుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం రూ.10లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. నిషేధిత