MP High Court SMA Treatment Aid : అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల పసిపాప ప్రాణాలను కాపాడేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన చొరవ చూపింది. 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) టైప్-2' అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్న ఇండోర్‌కు చెందిన అనికా శర్మ వైద్య చికిత్స కోసం.. రూ. 1 కోటి మేర అదనపు ఆర్థిక సాయం అందించే మార్గాలను అన్వేషించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈ కేసును మినహాయింపుగా పరిగణించి అవసరమైన మొత్తాన్ని త్వరగా సమకూర్చాలని న్యాయస్థానం భావించింది.రూ.9.55 కోట్ల ఇంజెక్షన్.. భారీగానే అందిన నిధులు, అయినా?ఇండోర్‌కు చెందిన అనికా శర్మ అనే మూడేళ్ల చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) టైప్-2 వ్యాధితో బాధ పడుతోంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగాక గానీ ఈ వ్యాధి బయటపడలేదు. అయితే అప్పటికే ఆస్తులు అన్నీ అమ్ముకుని చికిత్స చేయించిన తల్లిదండ్రులకు.. పాపకు రూ.9.55 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తేనే వ్యాధి తగ్గుతుందని చెప్పారు. దీంతో పాప సహా ఆమె తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం కింద గరిష్టంగా రూ. 50 లక్షల వరకు చిన్నారికి ఆర్థిక సాయం లభిస్తుండగా.. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు చేపట్టిన ప్రచార కార్యక్రమాల ద్వారా దాదాపు రూ. 8 కోట్ల నిధులు సేకరించారు.ఇంకా కోటి రూపాయాలు కావాల్సి రావడంతో..!వీటితో పాటు ఇంకో కోటి రూపాయలు కావాల్సి ఉండగా.. కోర్టును ఆశ్రయించారు పాప తల్లిదండ్రులు. ఈక్రమంలోనే విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ ఎన్ భట్.. కేంద్ర ప్రభుత్వ సాయం రూ. 50 లక్షలతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ. 8 కోట్లను కలిపినా.. ఇంజెక్షన్ కొనుగోలుకు ఇంకా రూ. 1 కోటి మేర కొరత