
మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) ఇప్పుడు కొత్త అవతారంలో వస్తున్నారు. బాలీవుడ్ లో ఒకప్పుడు పెద్ద స్టార్ గా చలామణి చేసిన మాధురీ ఇటీవల తల్లి పాత్రలు పోషిస్తున్నారు. వెబ్ షోలు, సినిమాలతో రెండో ఇన్నింగ్స్ లో కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు టీవీ తెరపై ఆమె కనిపిస్తారు. బాలీవుడ్ లో లెజెండ్ గా గుర్తింపు పొందిన అమితాబ్ బచ్చన్ టీవీ హోస్ట్ గా కొత్త చరిత్ర, కొత్త శకం సృష్టించారు. కేబీసి (కౌన్ బనేగా కరోడ్పతి) కార్యక్రమాన్ని ఆయన దాదాపు పాతికేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో కొన్నాళ్ళు కొనసాగింది. నాగార్జున, ఎన్టీఆర్ వంటి స్టార్స్ హోస్ట్ చేశారు. తమిళ్ లో సూర్య కూడా హోస్ట్ చేశాడు. ఇప్పుడు మరాఠీ భాషలో కోన్ హానర్ కరోడ్పతి (Kon Honar Crorepati) అనే పేరుతో మరోసారి రానుంది. ఈ షోకి మాధురీ దీక్షిత్ హోస్ట్. దాదాపు 24 ఏళ్ల తర్వాత మాధురి బుల్లితెరపైకి అడుగుపెడ్తున్నారు. ఈ షోని గతంలో మరాఠి నటులు సచిన్ ఖేడేకర్ వంటి వారు హోస్ట్ చేశారు. తర్వాత దాన్ని ఆపేశారు. మళ్ళీ కొత్తగా మాధురీ దీక్షిత్ తో సోని లివ్ లో రానుంది
.