
ఏపీలోని మచిలీపట్నం నుంచి మహారాష్ట్రలోని సాయి నగర్ షిర్టీ స్టేషన్ కు రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలు (Machilipatnam-Sainagar Shirdi Express) ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్. ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం దక్షిణ కోస్తా రైల్వే మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ లో కోచ్ లను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు దీన్ని ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది.విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఇక ప్రతీ వారం..!మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ కు ఉన్న ప్రస్తుత సాధారణ కోచ్ లను అత్యాధునిక ఎల్ హెచ్ బీ కోచ్ లుగా మారుస్తూ దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ రైలు (17208), అలాగే సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం రైలు (17207) రెండింటికీ కోచ్ లు మారతాయి. మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ రైలు కు ఇవాళ్టి నుంది, సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం రైలు కు రేపటి నుంచి ఇలా కోచ్ లు మారుస్తున్నారు. తాజా మార్పుల తర్వాత ఈ రెండు రైళ్లలోనూ ఒక ఫస్ట్ ఏసీ కోచ్, 2 సెకండ్ ఏసీ కోచ్ లు, 2 థర్డ్ ఏసీ కోచ్ లు, 9 స్లీపర్ క్లాస్ కోచ్ లు, 4 సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి. అలాగే దివ్యాంగ ప్రయాణికులకు అనుకూలమైన ఒక సెకండ్ క్లాస్ లగేజీ-బ్రేక్ వాన్, ఒక పవర్ కార్ కూడా ఉంటాయి. రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధలో కీలక మార్పులు..! నిమిషానికి లక్షన్నర బుకింగ్స్ ..!ఈ కోచ్ ల లోని యాంటీ-టెలిస్కోపిక్ డిజైన్ ప్రమాదం సంభవించినప్పుడు కోచ్‌లు ఒకదానిపై మరొకటి ఎక్కడం, పైకి లేవడం లేదా పరస్పరం లోనికి చొచ్చుకుపోవడాన్ని నిరోధిస్తుంది. తేలికపాటి క్రోమ్ స్టీల్‌తో తయారు చేసిన ఈ కోచ్‌లలో అధునాతన గ్యాస్-హైడ్రాలిక్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల అధిక వేగాల్లో కూడా తక్కువ దూరంలో సమర్థవంతంగా బ్రేకులు