© 2026 nimisham.in

తక్కువ క్రెడిట్ స్కోరుతో లోన్లపై అధిక వడ్డీ భారం

హై ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరుగుతాయా?

ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

Low Credit Score : మీ క్రెడిట్ స్కోరు ఎంత? చెక్ చేసుకున్నారా? తక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే లోన్లు, ఇన్సూరెన్స్ భారంగా మారుతాయని అంటుంటారు. అంతేకాదు.. ఒకవేళ లోన్లు, ఇన్సూరెన్స్ ఇచ్చినా అధిక ప్రీమియంతోనే ఉంటాయి.

ఈ రోజుల్లో, క్రెడిట్ స్కోర్లు లోన్లకే కాదు.. అనేక ఇతర ఆర్థిక ప్రయోజనాలకు కూడా కీలకమే.. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డుల వరకు క్రెడిట్ స్కోర్లు మీ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాయి. క్రెడిట్ స్కోర్లతో బీమా ప్రీమియంపై ప్రభావం ఏంటి? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అది ఎలాగో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..

ఇన్సూరెన్స్‌పై క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్? :
భారత్‌లో తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నంత మాత్రాన మీ ఇన్సూరెన్స్ ప్రీమియం నేరుగా పెరిగే అవకాశం ఉండదు. ఇన్సూరెన్స్, లోన్ల మధ్య రిస్క్ అంచనాలు భిన్నంగా ఉంటాయి. ఆరోగ్య బీమా ప్రీమియంల విషయంలో కంపెనీ ప్రధానంగా మీ ఆరోగ్యం, హెల్త్ రిస్క్‌లను లెక్కలోకి తీసుకుంటుంది.

Read Also : Tata Curvv Series X : రూ.9.99 లక్షలకే టాటా కర్వ్ కొత్త సిరీస్ X కారు.. ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు ఉన్నాయంటే!

ఉదాహరణకు.. మీ వయస్సు, ఆరోగ్య పరిస్థితి, మీకు ముందు నుంచే ఉన్న అనారోగ్య సమస్యలు, గతంలో జరిగిన శస్త్రచికిత్సలు, అనారోగ్యాలు, ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, గతంలోని క్లెయిమ్‌లు వంటివి పరిగణనలోకి తీసుకుంటాయి. ఒకవేళ ఒక వ్యక్తికి తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా వారికి ఎలాంటి హెల్త్ ఇష్యూలు లేకుంటే అప్పుడు వారి ఆరోగ్య బీమా ప్రీమియం పెరగడం కూడా అసాధారమేం కాదు..

మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే.. :
ప్రీమియంను డిసైడ్ చేసేటప్పడు వెహికల్ ఏజ్, ఇంజిన్ కెపాసిటీ, వాహన వినియోగం, ప్రదేశం, డ్రైవర్ వివరాలు, మునుపటి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, వాహనం ఐడీవీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదే మీకు లో-క్రెడిట్ స్కోర్ ఉంటే కారు లేదా బైక్ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా పెరుగుతుంది.

క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ వాడకంపై ఆధారపడి ఉంటుంది.