
ఇంటర్నెట్ డెస్క్: తీవ్ర అనారోగ్యంతో ఇటీవల లియోనెల్ మెస్సి (Lionel Messi) తండ్రి జార్జ్ మెస్సి తుది శ్వాస విడిచారు. ఫుట్బాల్ కెరీర్లో మెస్సి ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో ఆయన పాత్ర కీలకమైంది. అలాంటి వ్యక్తి లేకపోవడంతో మెస్సి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లినట్లు అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో తొలిసారి తన తండ్రి మరణంపై మెస్సి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు. ఆటకు వీడ్కోలు పలకబోతున్నాడా? అని సందేహాలు మొదలయ్యాయి. ‘‘నాన్నా (Messi Father).. మీరు లేరనే నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా. నిన్ను ఇక చూడలేనని ఊహను కూడా జీర్ణించుకోవడం కష్టంగా మారింది. ఇకనుంచి మనమిద్దరం మాట్లాడుకోలేం. మీరు ఎంత బాధను అనుభవించారో నాకు తెలుసు. కానీ, మరీ తొందరగా మమ్మల్ని వదిలి వెళ్లావు. మనం కలిసి ఆస్వాదించాల్సింది చాలానే ఉంది. గత ప్రపంచ కప్లో నా నుంచి మెరుగైన ప్రదర్శన చూడాలని నువ్వు కోరుకున్నావు. కానీ, అది మొదలవ్వడానికి ముందే మీ ఆరోగ్యం క్షీణించింది. నేను ఆడిన పెద్ద టోర్నీ సమయంలో మీరు లేకపోవడం ఇదే తొలిసారి. ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత మీ నుంచి వచ్చే సందేశం కోసం ఎదురుచూసేవాడిని. అది రాకపోవడం ఇప్పుడు లోటుగా అనిపిస్తోంది. మీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని నాకు అర్థమైంది. గత వరల్డ్ కప్లో నేను ఎంత దూరం వెళ్తే.. ఆటను చూసేందుకు అంత సమయం దొరుకుతుందని భావించా. మన జట్టు ఫైనల్కు చేరుకుంది. కానీ, మీరు అక్కడ లేరు. తుది పోరులో పెనాల్టీల ద్వారా ఓడిపోయామని మీరు అనుకున్నారు. అయితే, మ్యాచ్ సమయంలో జరిగిన విషయాల గురించి మాట్లాడలేకపోయాం. మీరు లేకుండా నేను ఎలా ఉండాలో నాకు తెలియడం లేదు. ఫుట్బాల్ కెరీర్ను మరింత కాలం కొనసాగించడం కూడా అనుమానమే. తొలి నుంచి మీరు నాతోపాటే ఉన్నారు. కానీ, ఇప్పుడు నన్ను వదిలి వెళ్లిపోయారు. ఇంకొంత కాలం ఎందుకు