
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు ఎనలేని ఆనందాన్ని పంచిన ఆ విలువై ఆటగాడి వెనుక నిలబడిన కొండంత అండ ఇక లేరు. మెస్సీని ఒక సామాన్య బాలుడి నుంచి ప్రపంచ ఫుట్‌బాల్ రాజకుమారుడిగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమించిన ఆయన తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూశారు. 68 ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు అర్జెంటీనా స్పెయిన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అర్జెంటీనాలోని మెస్సీ స్వస్థలమైన రొసారియో నగరంలో జార్జ్ మెస్సీ కన్నుమూసినట్లు సమాచారం రావడంతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ కెరీర్‌ను పునాది స్థాయి నుంచి మలచడంలో ఆయన తండ్రి జార్జ్ మెస్సీ పాత్ర అత్యంత కీలకమైనది. చిన్నతనం నుంచే కొడుకులోని అద్భుతమైన ప్రతిభను గుర్తించి, ప్రతి అడుగులోనూ కొండంత మద్దతుగా నిలిచారు. క్రమశిక్షణ, స్పష్టమైన విజన్, అమితమైన ఆప్యాయతతో తన కుమారుడిని అత్యున్నత శిఖరాలకు చేర్చడంలో జార్జ్ ఒక బలమైన స్తంభంలా నిలబడ్డారు. మెస్సీ తొలిసారిగా ఫుట్‌బాల్ ఓనమాలు దిద్దిన ప్రముఖ క్లబ్ 'న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్' సోషల్ మీడియా వేదికగా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించింది. 68 ఏళ్ల వయసులో రొసారియోలో జార్జ్ కన్నుమూశారని పేర్కొంటూ, మెస్సీ కుటుంబానికి తమ గాఢ సానుభూతిని తెలియజేసింది. తన కుమారుడికి చిన్నతనంలోనే న్యూవెల్స్ క్లబ్ రంగులను ప్రేమించడం నేర్పినందుకు జార్జ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఆ క్లబ్, జార్జ్ భార్య సెలియా కుచిట్టినీతో పాటు కుమారులు లియోనెల్, రోడ్రిగో, మాటియాస్, కుమార్తె మారియా సోల్‌కు తమ సంతాపాన్ని పంచుకుంది. జార్జ్ మెస్సీ గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్ టోర్నీ సమయంలోనే