
మెడ నిండుగా, అందంగా కనిపించాలనుకుంటే ఈ డబుల్ లేయర్ కాసుల నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. చీరలు, లెహంగాలతో లుక్ అదిరిపోతుంది. చిన్న చిన్న గోల్డ్ మువ్వలతో ఉన్న ఈ సింపుల్, స్టైలిష్ డిజైన్ నెక్లెస్ ని 12 గ్రాముల్లో తీసుకోవచ్చు. డ్రెస్సులతో కూడా ఈ నెక్లెస్ బాగుంటుంది. గోల్డ్ పూసలు, పువ్వల డిజైన్ లో ఉన్న ఈ నెక్లెస్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. దీన్ని 20 గ్రాముల్లోపు తీసుకోవచ్చు. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. పూసలు, కాసులతో ఉన్న ఈ గోల్డె నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మ్యాచింగ్ జుంకాలతో స్టైల్ చేయవచ్చు. మోడ్రన్ లుక్ కోరుకునేవారికి హస్లీ డిజైన్ నెక్లెస్ మంచి ఎంపిక. ఇది చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది. స్టోన్స్, కుందన్స్ తో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ నెక్లెస్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి బెస్ట్ ఛాయిస్. లైట్ వెయిట్ లో వస్తుంది. హెవీ లుక్ ఇస్తుంది. సింపుల్ లుక్ కోరుకునేవారికి బ్రేస్లెట్ స్టైల్ నెక్లెస్ బాగుంటుంది. ఇలాంటి డిజైన్స్ ని 10 గ్రాముల్లోపు తీసుకోవచ్చు. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది. Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్ Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్