
ఇంటర్నెట్డెస్క్: పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తయ్యబాకు (LeT) చెందిన సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లష్కరేకు చెందిన ముసుగు సంస్థ జమాత్ ఉద్ దవాలో ఇతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రార్థనామందిరం ప్రవేశ ద్వారం వద్ద అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కోలుకోలేదు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానా.. లేదా విషప్రయోగం కారణంగా మరణించాడా అనేది కచ్చితంగా తెలియరాలేదు. జమ్మూకశ్మీర్లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్హౌసలు, ఆర్థిక సాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం వంటివి చేస్తుంటాడు.నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను పంపుతుంటాడు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం సమకూర్చడం కూడా ఇతడి బాధ్యత. ఇటీవల లష్కరేకు చెందిన సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ ఓ వీడియో విడుదల చేశాడు. తమ సంస్థకు చెందిన 30 మంది సభ్యులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఆరోపించాడు. వీరంతా గత నాలుగేళ్లలో పాక్, పీవోకేలో మరణించినట్లు పేర్కొన్నాడు. ఇటువంటి హత్యలు జరుగుతున్నట్లు లష్కరే బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు