© 2026 nimisham.in
అర్ధరాత్రి ఇంట్లో దూరిన చిరుతపులి..సీసీటీవీ వీడియో వైరల్ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కరకంబాడి రోడ్డులోని లెక్చరర్ బాలాజీ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో చిరుత చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే, గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ భయంకరమైన దృశ్యాలన్నీ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గత మూడు రోజులుగా చిరుత ఇదే ప్రాంతంలో తిరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన