
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులోని ఆటగాళ్లకు గాయాల బెడద వెంటాడుతుంటే.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE)కు స్పోర్ట్స్ సైన్స్ నిపుణుల కొరత వేధిస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ప్రెస్మీట్లో సీవోఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అత్యంత సంపన్నమైన బీసీసీఐ బోర్డు పర్యవేక్షణలోని సీవోఈలో పనిచేసేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించాడు. ‘‘వీవీఎస్ లక్ష్మణ్ (VVS Lakshman) స్టేట్మెంట్ చూశా. నిపుణుల కోసం చాలా మందిని అప్రోచ్ అయినట్లు చెప్పారు. చివరి నిమిషంలో వారు వెనక్కి తగ్గుతున్నట్లు లక్ష్మణ్ అన్నారు. ఎందుకు అలా జరుగుతుందో విశ్లేషించుకోవాలి. నేనేమీ నిపుణుడిని కాదు. బీసీసీఐ నియమించిన నిపుణులు వారి కర్తవ్యం నిర్వర్తించాలి. సాధారణంగా బీసీసీఐతో కలిసి పనిచేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బోర్డు. కానీ, నిపుణులు ముందుకు రాకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే, ప్లేయర్లనే తీసుకోండి.. తమ దేశాల మ్యాచులను పక్కన పెట్టి మరీ ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆర్జన ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ, ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిజియోథెరపిస్ట్‌లు, మెడికల్ ప్రొఫెషనల్స్ బీసీసీఐతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. వారి కోసం మనం పెద్ద మొత్తంలో చెల్లించగలం. మంచి కాంట్రాక్ట్‌లను ఇవ్వగలం. ఇక్కడికి వచ్చి పనిచేసిన వారు పెద్ద మొత్తంలో డబ్బును తమతోపాటు తీసుకెళ్తారు. మిగతా బోర్డులతో పోలిస్తే ఎక్కువగా బీసీసీఐనే చెల్లిస్తుంది’’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు. ‘‘మనం గాయాలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా బుమ్రా మ్యాచ్ ఆడలేదు. దీంతో భారత్ 387 పరుగులను సమర్పించింది. అదీనూ సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్. కీలకమైన ప్లేయర్లు గాయాల బారిన పడితే ఎంతటి నష్టం వస్తుందో ఆ మ్యాచ్ ఫలితాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. మేనేజ్మెంట్ ఈ విషయంపై దృష్టిసారించి