
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) తో పాటు ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో (ISRO) చంద్రుడిపై మానవ నివాసం సాధ్యమో, కాదో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు చేపట్టింది... చంద్రయాన్ 1,2,3 పూర్తవగా చంద్రయాన్ 4 కు సిద్దమయ్యింది. అమెరికా అయితే 50 ఏళ్ల కిందటే ఏకంగా మనుషులనే (వ్యోమగాములను) చంద్రుడిపైకి పంపింది. ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే చంద్రుడిపై మనిషి శాశ్వత నివాసం సాధ్యమో, కాదో ఇంకా తేలనేలేదు... అప్పుడే అక్కడ భూముల విక్రయాలు ప్రారంభించి రియల్ ఎస్టేట్ దందా ప్రారంభించాయి కొన్ని సంస్థలు. ఇలా లూనార్ ఎంబసీ, లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ వంటి సంస్థలు చంద్రుడిపై భూములను విక్రయిస్తున్నాయి. చాలామంది సెలబ్రిటీలే కాదు సామాన్యులు సైతం చంద్రుడిపై భూములు కొంటున్నారు. 1980లలో డెన్నిస్ హోప్ అనే వ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష చట్టంలోని ఓ లొసుగును వాడుకుని చంద్రుడిపై భూముల అమ్మకాన్ని ప్రారంభించాడు. దేశాలు చంద్రుడిని సొంతం చేసుకోలేవు కానీ, వ్యక్తులు కొనడాన్ని ఏ చట్టం ఆపలేదని అతను వాదిస్తున్నాడు. ఇలా చంద్రుడిపై భూములను అమ్మడానికే 'లూనార్ ఎంబసీ' అనే సంస్థను స్థాపించాడు… ఇప్పటివరకు చాలామందికే అమ్మాడు. ఇలా చంద్రుడిపై స్థలం కొన్నవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే చంద్రుడిపై భూమిని కొనుగోలుకు చట్టబద్దత లేదని తెలిసినా చాలామంది సరదాగా కొంటున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులకు గిప్టుగా ఇవ్వడానికి లేదంటే అంతరిక్ష అంశాలపై ఆసక్తితో చంద్రుడిపై భూమిని కొంటున్నారు. అందుకే నాామమాత్రపు ధరలకే చంద్రుడిపై భూమి లభిస్తోంది… ల్యాండ్ డీడ్, మ్యాప్, ఇతర పత్రాలు ఉన్నప్పటికీ చంద్రుడిపై ఎవరికీ, ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు. స్థలం ధర : చంద్రుడిపై ఎకరం భూమి కొనడానికి సగటున 20 నుంచి 40 డాలర్లు ఖర్చు అవుతుంది. మన కరెన్సీలో సుమారు రూ.1,700 నుంచి రూ.3,400