© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. లక్ష్మీ నారాయణ రాజయోగం 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ముఖ్యంగా మేధస్సు, వ్యాపారం, సంభాషణలకు కారకుడిగా పరిగణించబడే బుధుడు, సంపద, అందం మరియు ఆనందానికి ప్రతీక అయిన శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఆర్థికంగా పురోగతి, చేసే వృత్తిలో ఉన్నత అవకాశాలు.. వ్యక్తిగత జీవితంలో మంచి అభివృద్ధికి దారితీస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్న మాట. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చేసిన అంచనాల ప్రకారం, సెప్టెంబర్ 2026లో ఏర్పడనున్న ఈ రాజయోగం ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా ఉండబోతుంది. లక్ష్మీ నారాయణ రాజయోగం సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. క్లయింట్లు లేదా విస్తరణ అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక పరంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొత్తగా ఆలోచించే అవకాశం లభించవచ్చు. కానీ ఇవి జ్యోతిష్య నమ్మకాలపై ఆధారపడిన సాధారణ ఫలితాలు. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకం, గ్రహ స్థానాలు మరియు దశ-భుక్తి ఆధారంగా ఫలితాలు మారవచ్చు. కన్య రాశి.. కన్య రాశి వారు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సహాయకారిగా పనిచేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతితో పాటు జీతం పెంపుదల ఉండనుంది. కొత్త పదవి వంటి
అవకాశాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు లభిస్తాయి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తే, మంచి ఫలితాలు అందుకుంటారు.
వృశ్చిక రాశి.. లక్ష్మీ నారాయణ రాజయోగం వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలలో అనుకూలమైన మార్పులను తీసుకురాబోతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ఒక అవకాశాన్ని కల్పించవచ్చు. ఆస్తి, భూమి లేదా పెట్టుబడి సంబంధిత విషయాలలో కొన్ని సానుకూల పరిణామాలు ఉంటాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు, మార్కెట్ పరిస్థితిని నిపుణుల సలహాను పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోకూడదు. మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు లభించవచ్చు. ప్రేమ, వివాహ సంబంధిత విషయాలలో కూడా సానుకూల పరిణామాలు ఉంటాయి.
వృషభ రాశి.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, లక్ష్మీ నారాయణ రాజయోగం ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక విషయాలలో సానుకూల మార్పులు ఉండబోతున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారవేత్తలకు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి సరైన అవకాశం లభించవచ్చు. తమ ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అయితే, ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బెటర్.
మిథున రాశి.. వృత్తి పరంగా మిథున రాశి వారికి ఈ కాలం అత్యంత కీలకమైనది. తమ ఉద్యోగంలో మంచి పనితీరు కనబరిచిన వారికి పై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వారికి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన కాంట్రాక్టులు లభించే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి లేదా వ్యాపార పరిధిని విస్తరించడానికి ఇదే సరైన అవకాశం. వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సానుకూల మార్పులు సంభవించవచ్చు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో కొత్త అవకాశాలు లభించే అవకాశాలుంటాయి. పొదుపే మీకు శ్రీరామరక్ష.
Disclaimer (గమనిక): ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, పండితులు జ్యోతిష్య పండితులు గ్రహ గోచారం ఆధారం ఇవ్వబడింది. జీ మీడియా న్యూస్ దీనిని ధృవీకరించదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.