
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Lady teacher swept away in flood water in ap: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ నుంచి అతి భారీగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికి కూడా వానలు కురవక పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం వరుణుడు కుండపోతగా వానలు కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణ కోసం బయలుదేరిన ఒక ఉపాధ్యాయురాలు ఆకస్మికంగా వరదలో చిక్కుకుంది.
ఈ ఘటన వార్తలలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కర్లపొద గ్రామం వద్ద ఈ భయంకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎం. మణి ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లేందుకు బయలు దేరింది. ఇంతలో ఆమె మార్గంలో వాగును దాటుతుండగా వరద ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది.దీంతో ఆమె వరదలో కొంత దూరం కొట్టుకుని పోయింది. ఆ తర్వాత ఆమె ఒక చెట్టు కొమ్మను పట్టుకుంది. అక్కడ అరవడంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై వెంటనే ఆమెను కాపాడారు.
Read more: Tirupati: తిరుపతి అటవీ ప్రాంతంలో 22 ఏనుగుల సంచారం.!. హైఅలర్ట్ జారీచేసిన ఫారెస్ట్ సిబ్బంది... వీడియో వైరల్..
అనంతరం హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పెద్ద ప్రమాదం నుంచి బైటపడటంతో లేడీ టీచర్ ఊపిరిపీల్చుకుంది. దీనిపై ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఆ వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Recommended for you
Found this helpful?
Share this story with your network



