
గూడూరు గ్రామీణం: డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్న వైకాపా నేతలు దమ్ముంటే చర్చలకు రావాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సవాల్ చేశారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైకాపాకు 11 సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. వారి నాయకులు, కార్యకర్తలకు శవ రాజకీయాలు చేయడం అలవాటే అని విమర్శించారు. తల్లిదండ్రుల తర్వాత గురువును పూజిస్తామని అటువంటి గురువులపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు. ఎస్సీ మహిళ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే దారుణంగా ప్రవర్తించిన ఘనత వైకాపా నేతలకే చెల్లుతుందని విమర్శించారు. జిల్లా వైకాపా నేతలు డీఎస్సీపై సందేహాలు ఉంటే చర్చలకు రావాలని రేపు గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో ఉంటానని సవాల్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.