
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్లలోని మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఉదయ కుమార్, అభిరామ్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ షహీనా పర్వీన్ సోమవారం తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన అండర్-16 విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను గుర్తించి గ్రామానికి చెందిన విజయభాస్కర్ రూ.7 వేలు విలువ చేసే క్రీడా సామగ్రిని విరాళంగా అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలిచి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ కోచ్ రామన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.