
డయల్‌ యువర్‌ సీఎండీ, ఎస్‌ఈ ఫోన్‌లో సమస్య విన్నవించగా వెంటనే స్పందించిన అధికారులు నూతన స్తంభం ఏర్పాటు చేస్తున్నారిలా.. న్యూస్‌టుడే, కర్నూలు వెంకటరమణ కాలనీ : స్తంభాలు కూలిపోయేలా ఉన్నాయి.. విద్యుత్తు తీగలు కిందకు వేలాడుతున్నాయి.. ఇళ్లపై తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి.. ఆయా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. వినియోగదారులు విసిగి వేసారిపోయేవారు.. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు దృష్టి సారించారు. గృహ, వ్యవసాయ, వాణిజ్య విద్యుత్తు వినియోగదారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ‘పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌(పీపీపీ)’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డయల్‌ యువర్‌ సీఎండీ, డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.