
కుమరం భీం జిల్లాలో సోమవారం నిర్వహించే వినాయక చవితికి మండపాలు సిద్ధమయ్యాయి జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. తొలిపూజలు అందుకునే గణపయ్యను కొలువు తీరేలా సర్వాంగ సుందరంగా మండపాలను సిద్ధం చేశారు. పట్టణాల నుంచి పల్లెల వరకు... చౌరస్తాల నుంచి గల్లీల వరకు తొమ్మిది రోజుల పాటు వినాయక సంబురాలతో భక్తులు తన్మయత్వం చెందనున్నారు.





