
మండలంలోని జామ్నిలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి బుధవారం నిర్వహించే చలో ఉట్నూర్ ఆదివాసీ మార్చ్ పోస్టర్లను ఆదివారం ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మధురాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.





