
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మధ్య మైదానంలో జరిగిన ఓ తీవ్ర వాగ్వాదాన్ని ఏళ్ల తర్వాత బయటపెట్టాడు. 2005లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో సంగక్కర తనను, భారత ఆటగాళ్లను 'మోసగాళ్లు (చీటర్స్)' అని పిలుస్తూ వ్యక్తిగత దూషణలకు దిగాడని పఠాన్ సంచలన విషయాలు వెల్లడించాడు. అయితే, ఆ తర్వాత ఐపీఎల్ పుణ్యమా అని ఇద్దరూ మళ్లీ కలిసిపోయి మంచి స్నేహితులుగా మారినట్లు కూడా తెలిపాడు.అసలేం జరిగిందంటే..!2005లో శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో బంతుల బాక్సును మార్చడంపై శ్రీలంక ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా సంగక్కర దీనిపై చాలా ఆగ్రహంగా ఉన్నాడు. అదే సమయంలో జట్టు యాజమాన్యం కోరిక మేరకు ఇర్ఫాన్ పఠాన్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. ఈ వివాదం గురించి తనకు ఏమాత్రం తెలియదని పఠాన్ పేర్కొన్నాడు."నేను ఓపెనర్‌గా బరిలోకి దిగి 93 పరుగులు చేశాను. ఆ ఇన్నింగ్స్‌లో ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టాను. కొత్త బంతితో మురళీధరన్‌ను సిక్సర్లు కొట్టడమంటే ప్రత్యర్థి ప్రణాళికలను దెబ్బతీసినట్లే. అది చూసి సంగక్కర అకస్మాత్తుగా స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు. 'మీరు మోసగాళ్లు, మీ తల్లిదండ్రులు మీకు ఇవే నేర్పిస్తారా' అంటూ వ్యక్తిగత దూషణలకు దిగాడు. అతను వ్యక్తిగతంగా మాట్లాడటంతో నేను కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాను. కానీ, గొడవ మొదలుపెట్టింది అతనే" అని పఠాన్ ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు.ఐపీఎల్లో మళ్లీ కలిశారిలా..!మైదానంలో